Monday, December 23, 2024

వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిలతో చర్చలు జరపలేదు: జానారెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిలతో తాను చర్చలు జరిపినట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి స్పందించారు. షర్మిలతో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. షర్మిలతో తాను మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని మాత్రమే చేస్తానన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ టిపి కాంగ్రెస్‌లో విలీనం చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని వీలినం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే జానారెడ్డితో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో వాస్తవం లేదని జానారెడ్డి ఖండించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News