Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయలేదు : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రెండు సభలు ట్రెయిలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపి కె. లక్ష్మణ్ అన్నారు. గురువారం బిజెపి కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో వైఎస్‌ను తొలగించి తనను సిఎం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని బంద్ చేస్తానని కెసిఆర్ చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో కుటుంబంతో కలిసి సోనియాగాంధీకి దాసోహమై టిఆర్‌ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నది వాస్తవం కాదా? అని గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ పతనం ఖాయమని తేలిపోయింది..మోడీ సభకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలే నిదర్శనం. ప్రజల్లో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పబోతున్నారు.

బండి సంజయ్ మాట్లాడుతూ కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము బిఆర్‌ఎస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మేం బిఆర్‌ఎస్‌తో కలిసి ఏ ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మక శక్తి ఎదుగుతోందని 2018 ఎన్నికల తర్వాత వాస్తవాలతో నిరూపించాం. ఒంటరిగా పోటీ చేసిన బిజెపి నాలుగు ఎంపి స్థానాలు గెలుచుకుని 20 శాతం ఓట్లు సాధించిందన్నారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 9 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News