Sunday, January 19, 2025

అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం

- Advertisement -
- Advertisement -

దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా వేగంగా ఎదుగుతూ ప్రధాని మోడీ నియంతృత్వంపై అవిశ్రాంత యుద్ధం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ జైళ్లకు పంపుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపగా, ట్రయల్ కోర్ట్ నుండి జూన్ 20న బెయిల్ లభించిందని, మరుసటిరోజే సిబిఐ అరెస్ట్ చేయడం, బెయిల్ కు వ్యతరేకంగా ఈడీ సుప్రీం కోర్ట్ నుండి స్టే తీసుకురావడం అన్ని చూస్తే, అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి బయటికి రాకుండా చూసేందుకు బీజేపీ ఈడి, సిబిఐలను బిజెపి ఎంత దుర్వినియోగం చేస్తుందో దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని అయన తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోనళల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపలి, బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. బిజెపి కార్యాలయం ముందు ఆప్ శ్రేణులు ప్లకార్డులు, ఆప్ జండాలు చేతబూని, బీజేపీ, మోదీకి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మెరుపు వేగంతో దూసుకొచ్చి బారికేడ్ లను తోసే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం డాక్టర్ దిడ్డి సుధాకర్ తోసహా పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని దేశ ప్రజలు ఫూర్తి మెజారిటీ రాకుండా చేసి తిరస్కరించినా, అడ్డదారిన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మళ్ళి నిరంకుశత్వం వైపు పయనిస్తూ ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ దుర్మార్గం, క్రూరత్వం, అన్యాయంపై ’ఇండియా’ కూటమి దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఆపాలని, మోదీ ‘నియంతృత్వం పనిచేయదని, భారత ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తున్నారని అన్నారు. అతడిని ఎప్పటికీ జైల్లో బీజేపీ ఉంచలేదని, నిర్దోషిగా బయటకు వస్తాడని, రాజకీయంగా మోదీకు వణుకు పుట్టిస్తాడని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎండి మజీద్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నర్సింగ్ యమునా గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు విజయ్ మల్లంగి, అధికార ప్రతినిధులు ఆఫస సలాం, డా. లక్ష్య నాయుడు, జావీద్ షరీఫ్, నేతలు జైసింగ్ జాదవ్, కొడంగల్ శ్రీనివాస్, శివాజీ, సలావుద్దీన్, దర్శనం రమేష్, సోము రమేష్, కుత్బుద్దీన్, సలీమ్, పవార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News