Thursday, January 23, 2025

ఆ రోజు మాంసం తినలేదు: కరాటక మాజీ సిఎం సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మాంసాహారం తిని దేవాలయానికి వెళ్లారని బిజెపి ఆరోపణలపై కర్ణాటక మాజీ సిఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పందించారు. ప్రజల మతవిశ్వాసాలను సిద్ధరామయ్య గాయపరిచారని బిజెపి వర్గాల ఆరోపణలను ఆయన దేవాలయాన్ని సందర్శించిన రోజు తను మాంసాహారం తినలేదని మంగళవారం స్పష్టం చేశారు. అది పెద్ద విషయమే కాదని అయితే ఎవరి ఆహారాన్ని వారు తీసుకునే హక్కు ఉందన్నారు. కాగా ఆగస్టు 18న సిద్ధరామయ్య కొడిల్‌పేట్‌లోని బసవేశ్వర దేవాలయానికి వెళ్లారు. అయితే ఆయన తిని దేవాలయానికి వెళ్లారని వివాదం తలెత్తింది. దీనిపై ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ఆహారపు అలవాటులో భాగంగా మాంసం తినడం తప్పా అని ప్రశ్నించారు. మాంసాహారం,శాఖాహారం రెండింటిని తినడం తన అలవాటన్నారు. కొంతమంది తమ ఆహారపు అలవాట్లులో భాగంగా మాంసం తినరన్నారు. బిజెపి ఏ పని లేకపోవడం వల్లే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటి వివాదాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టని మరల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు.

Didn’t eat meat before visited Temple: Siddaramaiah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News