Monday, January 20, 2025

ఒక్క కాల్ కూడా పోలీసులకు చేయలేదు: అజిత్ పవర్

- Advertisement -
- Advertisement -

ముంబై: పుణేలోని కళ్యాణీ నగర్ లో తాగి మత్తులో ఉన్న యువకుడు మే 19న పోర్షే వాహనంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను గుద్ది చంపేసిన ఘటన జరిగింది. అయితే ఈ కేసులో తాను పుణే పోలీసు కమిషనర్ కు ఫోన్ చేయేలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం స్పష్టం చేశారు.

‘‘ నేను తరచూ పోలీస్ కమిషనర్ కు అనేక కాల్స్ చేస్తుంటాను. కానీ ఈ విషయంలో మాత్రం ఒక్క కాల్ కూడా చేయలేదు’’ అని అజిత్ పవార్ అన్నారు. ఆ వాహన ప్రమాదంలో అనీశ్ అవాధియ, అశ్విని కోష్తా అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చనిపోయారు. తమ పార్టీ ఎంఎల్ఏ సునీల్ టింగ్రే ను కూడా అజిత్ పవార్ సమర్థించారు. ఆయన పురమాయింపు పైనే పోలీసులు ఆ ప్రమాదం చేసిన టీనేజర్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News