Tuesday, January 21, 2025

హనీమూన్ ట్రిప్‌ కోసం విదేశాలకు వెళ్లి.. అనంతలోకాలకు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ ఎల్బీనగర్ : ఆరు మాసాల క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంట, హనీమూన్ ట్రిప్‌ కోసం విదేశాలకు వెళ్లారు. బాలి సముద్ర జలాల్లో సరదగా గడుపుదామని నీటిలోదిగిన భర్త.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన ఎల్బీనగర్ నాగోల్ అజేయ్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దీంతో కటుంబంలో విషాద ఛాయలు నెలకోన్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎల్బీనగర్ నాగోల్ డివిజన్ అజేయ్‌నగర్ కాలనీలో రాముని రవీందర్ విజయలక్ష్మి దంపతుల కుటుంబం నివాసం ఉంటుంది. రవీందర్ అల్కపురి చౌరస్తాలో హోటల్ నిర్వహిస్తాడు. రవీందర్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూమారై ఉన్నారు. చిన్న కూమారుడు వంశీకృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు.

వంశీకృష్ణ(27) కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో జూన్ 23 న పెళ్లి జరిగింది. హనీమూన్ కోసం ఈ నెల 13 న మలేషియా, ఇండోనేషియాలకు వెళ్లారు. ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరాన వద్ద హోటల్‌లో బస చేశారు. ఆదివారం ఉదయం సముద్ర గర్బంలో ఆక్వేరియం సందర్శించేందుకు వంశీకృష్ణ ఒక్కడే వెళ్లాడు. ఆక్వేరియం సందర్శించేందుకు వెళ్లినప్పుడు సరియగు రక్షణ చర్యలు తీసుకున్న సముద్ర గర్బంలో గల్లంతయ్యాడు. దీంతో స్దానిక పోలీసులు భార్యకు సమాచారం అందించారు. పోలీసులు వంశీకృష్ణ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బాలి బయల్దేరారు. తెలంగాణలో వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో వంశీకృష్ణ మెయిన్స్‌కు అర్హత పొందడాని భాధతో రవీందర్ తెలిపారు. వంశీకృష్ణ మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News