ముంబయిలో లీటర్‌కు రూ.96.41
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు డీజిల్ ధరను శుక్రవారం లీటర్‌కు 20 పైసలు పెంచాయి. దీంతో,లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.88.82, ముంబయిలో రూ.96.41కు చేరింది. పెట్రోల్ ధర యథాతథంగా ఢిల్లీలో రూ.101.19, ముంబయిలో రూ.107.26గా ఉన్నది. రెండు నెలలుగా డీజిల్ ధరలో మార్పు చేయకుండా, పెట్రోల్ ధరను పెంచిన కంపెనీలు ఈసారి పెట్రోల్ ధరను అలాగే ఉంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 77.50 డాలర్లకు చేరింది. వారంలో ఇది 2 శాతం పెరుగుదల. ఐదు వారాలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. 2018 తర్వాత ఇదే అత్యధిక ధర. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు సగటున 67 డాలర్లమేర పెరిగింది. సెప్టెంబర్ 5 నుంచి చమురు ధరల్ని దేశీయ కంపెనీలు నిలకడగా కొనసాగించాయి. ఈ ఏడాది మే 4 నుంచి జులై 17వరకు పెట్రోల్ ధర లీటర్‌కు రూ.11.44, డీజిల్ ధర రూ.9.14 పెరిగింది.