Tuesday, January 7, 2025

ఈవిఎంల ఓట్లలో తేడా… కానీ ఆధారం లేదు: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణె: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవిఎంలపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతునారు. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవర్ కూడా శనివారం ఈవిఎంల ద్వారా పోలయిన ఓట్లలో తేడాలున్నాయని ఆరోపించారు. అయితే తన పార్టీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

‘‘ఒకవేళ నేను ఇలా చెప్పుకుంటూ పోతే అది సరికాదు, మనం ప్రజల్లోకి వెళ్లాలి, వారిని జాగృతం చేయాలి’’ అని ఆయన తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఈవిఎంలపై ప్రశ్నలను లేవనెత్తాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News