- Advertisement -
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బిఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ డివికి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే సర్థిచెప్పేందుకు ప్రయత్నించినా నాయకులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఎమ్మెల్యే అయోమయంలో పడ్డారు. తెలంగాణలో ఎన్నికలు జోరు కొనసాగుతోంది. నేతలు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో అంతర్గత కలహాలు మంచిది కాదని నాయకులు చెబుతున్నారు.
- Advertisement -