Monday, December 23, 2024

తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం ఉదయం వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా బుడిదంపాడు-మంచుకొండ మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మంలో మిరప విక్రయించేందుకు వెళ్తున్న రైతులు ట్రాలీ వాహనం అదుపుతప్పడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు భద్రాద్రి జిల్లా టేకులపల్లి వాసి హనుమంతుగా(45)గా గుర్తించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎన్‌జివొ కాలనీలో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మూసి ఉన్న దుకాణాన్ని కారు ఢీకొట్టింది. మార్నింగ్ వాక్ చేస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో కారు వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు యువకులకు పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News