వైరస్ బారిన పడిన వారిలో తొలుత అలసట
తరువాత ఒంటి నొప్పులు, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి : దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ ఏంజెలిక్ కోయెట్జే
హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ ఏంజెలిక్ కోయెట్జే తెలిపారు. ఈ లక్షణాలు కూడా స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని చెప్పా రు. చికిత్స తర్వాత వైరస్ బాధితులు బా గా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే వ్యాప్తి చెందగలదన్న ఆందోళనల మధ్య ఈ వైరస్ కట్టడికి వివిధ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వేరియంట్ గు రించి తొలిసారి అప్రమత్తం చేసిన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జే ఈ వేరియంట్ సోకిన బాధితుల్లో ఉండే లక్షణాల గురించి కీలక విషయాలు వెల్లడించారు. కరోనా సోకిన వారికి రుచి, వాసన కోల్పోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటివి సాధారణ లక్షణా లు. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో.. రుచి, వాసన కోల్పోవడం లేదని ఏంజెలిక్ తెలిపారు.
తీవ్రమైన అలసట, నాడీ వేగం అధికంగా ఉం డటం వంటి అసాధారణ లక్షణాలు ఉంటున్నాయని చెప్పారు. ఈ లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయని వెల్లడించారు. వైద్య రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఏంజెలిక్… ఈ నెల ప్రారంభంలో తన కుటుంబంలోని నలగురు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుండగా… వారిలో లక్షణాలు విభిన్నంగా ఉండడం గమనించారు. అనంతరం న వంబర్ 18న దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీకి విషయాన్ని తెలియజేశారు. అనంతరం కొత్త వేరియంట్ బయటపడినట్లు తేలింది.
పిసిఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చు
కరోనా కొత్త వేరియంట్‌ను ఇతర వేరియంట్ల మాదిరిగానే పిసిఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఇతర పరీక్షల ఫలితాలను ఒమిక్రాన్ వేరియంట్ ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాని పేర్కొంది. ఈ వేరియంట్ వ్యాప్తి వే గం ఏ స్థాయిలో ఉందనే అంశంపై, రోగ లక్షణాల తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు మిగిలిన వాటికం టే ఎంత భిన్నంగా ఉంటాయో కూ డా చెప్పేందు కు తగినంత సమాచారం లేదని పేర్కొంది. కాకపోతే గతంలో కొవిడ్ బారినపడిన వారూ మరోసా రి ఒమిక్రాన్ బారిన పడేందుకు అవకాశం ఉందనడానికి ఆధారాలు లభించాయని వెల్లడించింది.
ఒమిక్రాన్ లక్షణాలు ఇవే
ఒమిక్రాన్ వైరస్ బారిన పడినవారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పులు, గొంతు లో కొద్దిగా గరగరగా ఉండటం, పొడి దగ్గు, కొద్ది పాటి జ్వరం కూడా ఉంటుంది. చాలావరకు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి. అయితే వైరస్ బారిన పడిన వారు ధైర్యంగా ఉండాలని, భయపడితే వారి పాలిట ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్ డెల్డా వేరియంట్ కంటే వేగంగా వ్యా ప్తి చెందే అవకాశం ఉండటంతో అందరం జాగ్రత్త అవసరం ఉందని సూచిస్తున్నారు.