Friday, December 20, 2024

బిజెపి కనీసం 140 సీట్లు కూడా గెలవడం కష్టమే: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

మహారాజ్ గంజ్ (యూపి): ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కనీసం 140 సీట్లు గెలవడం కూడా కష్టమేనని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం అన్నారు.  ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే ఎన్డిఏ నినాదాన్ని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు, కనుక బిజెపికి 140 సీట్లు రావడం కూడా కష్టమేనన్నారు.

బిజెపి రైతుల రుణాలు మాఫీ చేయకుండా, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇస్తోందని అన్నారు. ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పడితే రైతుల రుణ మాఫీ జరుగుతుందని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. మహారాజ్ గంజ్ లో కాంగ్రెస్ అభ్యర్థి విరేంద్ర చౌదరి తరఫున సంయుక్త ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వివరాలు తెలిపారు.

‘ఇండియా బ్లాక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తాము, సైనిక దళాలలో అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తాము’ అన్నారు. మహారాజ్ గంజ్ పోలింగ్ జూన్ 1న జరుగనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News