Wednesday, January 22, 2025

భారీ వర్షాలతో పెరుగుతున్న కష్టాలు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరమంతా చిత్తడిగా మరిపోయింది. కొద్దిసేపు గరువిచ్చినట్లే ఇచ్చి ఆ వెంటనే వర్షం కురుస్తుండడంతో నగరవాసలు బిక్కుబిక్కుమంటున్నారు. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కు రిసిన భారీ వర్షం నుంచి తేరుకోక ముందే మంగళవా రం తెల్లవారు జామున మరోసారి భారీ వర్షం కురువడంతో నగరవాసులకు మరిన్ని కష్టాలు పెరిగాయి. ఆ తర్వాత ఉదయమంతా గరువుచ్చినా వర్షం సా యంత్రం 4 గంటల తర్వాత తిరిగి ముసురందుకుంది. దీంతో వివిధ పనుల నిమిత్తం బయటికి వస్తున్న నగరవాసులు ఇబ్బందులు తప్పడంలేదు. ముఖ్యంగా ఉదయం వేళా కురిసిన భారీ వర్షానికి నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

దీంతో వాహనాలతో ఎక్కడికక్కడ నిలిచిపోవడం తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన మార్గాలైన ఉప్పల్, సికింద్రాబాద్, తార్నాక, మీదగా సికింద్రాబాద్ ఫ్యాట్నీ, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్‌పేట్ మార్గాల్లో భాగీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్, చాదర్‌ఘాట్ మార్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెర్ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా హైటెక్ సిటీలోనూ మార్గంలో ను ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రెండవ రోజు సైతం వాహనాదారులు రోడ్లపై గంటల తరబడి అష్ట కష్టాలు ప డ్డారు.

మరోవైపు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌తో పాటు హుస్సేన్ సాగర్‌లోకి అదే వరద వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్‌సాగర్ నుంచి 4 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి మూసీలో వరద నీరు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ నుంచి సైతం దిగువకు వరద నీటి ప్రవాహాం కొనసాగుతోంది. బుధవారం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ ఆలర్ట్‌ను ప్రకటించారు. అంతేకాకుండా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వ ర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News