Wednesday, February 12, 2025

93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించినట్టు బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తనను కలిసిన ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందానికి వివిరించారు. పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణ్ పేట),

సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ఇంటర్నెట్ కనిక్టివిటీ వల్ల స్థానికులకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు వైజంతీ దేశాయ్, కింబర్లీ జాన్స్ ఆధ్వర్యంలోని ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం వెల్లడించింది. మరో మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కనెక్టివిటీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శ్రీధర్ బాబు వారికి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కిమీ పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News