Monday, January 20, 2025

ప్రతి అధ్యాపకుడికి డిజిటల్ విద్య ఎంతో అవసరం: ఓయూ రిజిష్ట్రార్ మల్లేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: డిజిటల్ విద్యా ప్రతి అధ్యాపకుడిగా తప్పనిసరిగా మారిందని, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించాలని ఓయూ యూజిసి వ్యవహార డీన్ ప్రొఫెసర్ మల్లేశం సూచించారు.
‘డిజిటల్ ఎడ్యుకేషన్, మ్యాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సెస్ – ఆధునిక సాంకేతికత’ అనే అంశంపై ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో టీచర్ల ఉద్యోగానికి ఎలాంటి ప్రమాదం లేదని అభిప్రాయపడ్డారు. డిజిటలైజేషన్ యుగానికి అనుగుణంగా మారలేని ఉపాధ్యాయుల ఉద్యోగానికి ఖచ్చితంగా ప్రమాదం ఏర్పడుతుందని, మెరుగైన బోధనకు సాంకేతికత శక్తి ఉందని ఉపాధ్యాయులకు ఉద్బోధించారు. ఈఎమ్మార్సీ చేపట్టిన కార్యక్రమాన్ని అధ్యాపకులు చక్కగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

అనంతరం ఈఎమ్మార్సీ డైరెక్టర్ రఘపతి ప్రసంగిస్తూ భవిష్యత్తు డిజిటల్ అవసరాలను తీర్చేందుకు అధ్యాపకులు, విద్యార్థులకు ఈఎమ్మార్సీ వారధిగా ఉంటుందని మ్యాసివ్ ఆన్ లైన్ కోర్సుల రూపకల్పన కోసం అధ్యాపకులు కంటెంట్ అందిస్తే ఈఎమ్మార్సీ డిజిటల్ పాఠాలు అందిస్తుందని వివరించారు. ఈ సదస్సుకు హాజరైన ప్రొపెసర్ జగదీశ్వర్‌రావు,  వై.నర్సింహులు, ప్రొఫెసర్ మృణాళిని, డా. మశూద్, డిల్లీ ప్రొపెసర్ గణేష్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సదస్సు విజయవంతానికి సహకరించిన సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జేబీ నడ్డా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మినారాయణకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఓయూ పౌర సంబంధాల అధికారి ప్రొఫెసర్ ప్యాట్రిక్ ఆంతోని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News