- Advertisement -
హైదరాబాద్: డిజిటల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఘరానా మోసానికి పాల్పడింది. ఆన్‌లైన్ జాబ్.. వర్క్ ఫ్రం హోం… యూఎస్ బేసిడ్ కంపెనీ అంటూ నిరుద్యోగులకు వల వేసింది. నెలకు మూడు లక్షల పైనే జీతం.. ఐదు లక్షల యాభై వేలు డిపాజిట్ చేస్తే.. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని అమాయకుల నుండి కోట్లు వసూలు చేసింది. 700 వందల మంది నుంచి రూ.30కోట్ల మేర డిపాజిట్ కట్టించుకున్న కంపెనీ జెండా ఎత్తేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. డిజిటల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.
Digital India Pvt Ltd Company cheating in Hyderabad
- Advertisement -