Wednesday, January 22, 2025

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తన మెయిన్ బ్రాంచ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎల్‌హెచ్‌ఒ ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించి ఆధార్ కార్డుతో ముఖ ధృ-వీకరణ సాంకేతిక ద్వారా ఈ సర్టిఫికేట్ల ప్రమోషన్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పిబిబియు డిజిఎం రవీందర్ గౌరవ్ ప్రారంభించారు.

డిఒపిపిడబ్లు సీనియర్ కన్సల్టెంట్ రమన్‌జిత్ కౌర్, డిఒపిపిడబ్లు నుంచి సునయన, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్‌హెచ్‌ఒ జిఎం ఎన్‌డబ్లు1 మంజు శర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కొత్త సౌకర్యం పై పెన్షనర్లందరికీ అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. దీని కోసం పెన్షనర్లు అనధికార లింక్‌లను ఓపెన్ చేయవద్దని, అలాగే పిన్, పాస్‌వర్డ్‌లను పంచుకోవద్దని ఆమె సలహా ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News