Wednesday, January 22, 2025

పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో నగదు రహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూలవుతున్నాయా.. వసూలైనవి ఏమవుతున్నాయి. లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పంచాయతీల బలోపేతానికి, డిజిటల్ పరంగా మరింత ముందుకు నడిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. పంచాయతీల్లో ప్రధానంగా పన్నులు ప్రజలు నగదు రూపకంగా చెల్లిం పులు చేసేవారు. సాంకేతికత పరుగులు పెడుతున్న క్రమంలో ఈ రోజుల్లో కూరగాయలు మొదలుకొని ఇతర వస్తువులు కొనుగోలు

సైతం స్మార్ట్ ఫోన్ యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలను వినియోగిస్తున్నారు. దీంతో పంచాయతీల్లో సైతం యుపిఐ సేవలు అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో దీనిని అమల్లోకి రానున్నట్లు తెలిసింది. ఆగస్టు నెలాఖరులోపు అన్ని పంచాయతీల్లో యుపిఐ సేవల వినియోగ, పంచాయతీలుగా ప్రకటించటానికి కేంద్రం సిద్ధమవుతోంది.. రాష్ట్రంలోని 12 వేల పై చిలుకు గ్రామ పంచాయతీల్లో నగదు రహిత సేవలను అందుబాటులోకి తేనున్నారు.

ఇప్పటి వరకు నగదు, ఆన్‌లైన్‌లో చెల్లింపులు..
అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు మాత్రం ఇప్పటికీ నగదు రూపంలోనే చేస్తు న్నారు. ఇలా వసూలైన పన్నులు వివిధ అభివృద్ధి పనులను, ఇతర ఖర్చుల పేరుతో పద్దులు రాసి పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో పన్నుల వసూలు, పత్రాల జారీకి పంచాయతీల్లో యుపిఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో పంచాయతీ వ్యవస్థ పారదర్శకంగా ఉండనున్నది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంచాయతీలకు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేయనున్నారు. సంబంధిత అధికారులకు ఈ విషయంపై త్వరలో జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. సులువుగా మరింతగా దగ్గరయ్యేందుకు యుపిఐతో నగదు రహిత చెల్లింపులు ప్రజలు నిర్వహించే వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News