Saturday, December 21, 2024

మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు: విజయ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: బటన్ నొక్కడంలో సగం డబ్బును మద్యం ద్వారానే లాగేస్తున్నారని టిడిపి నేత ఎన్ విజయ్ మండిపడ్డారు. టిడిపి అధికార ప్రతినిధి ఎన్ విజయ్ ఉమార్ మీడియాతో ప్రసంగించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. డిజిటల్ చెల్లింపులు ఎందుకు ఉండటంలేదో జగనే చెప్పాలన్నారు. ప్రజల నుంచి రోజుకు రూ.80 కోట్లు మద్యం ద్వారా దోచేస్తున్నారని, ఐదేళ్లలో ప్రభుత్వానికి మద్యంపై లక్షా 25 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ఆ లెక్కన ఏడాదికి సుమారు రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తుందని వివరించారు.

ఈ చేత్తో ఇస్తూ ఆ చేత్తో లాగేసుకోవడం జగన్‌కు బాగా అలవాటైందని, మద్యం ధరలు పెంచింది.. వినియోగం తగ్గించడానికేనని చెబుతున్నారని, మద్యం వినియోగం ఏమాత్రం తగ్గించారో చెప్పగలరా? అని విజయ్ ప్రశ్నించారు. వినియోగం తగ్గడమంటే 308 లక్షల నుంచి 335 లక్షల కేసులకు పెరగడమా? అని చురకలంటించారు. ప్రతి ఇంటికి ఎంత ఇస్తున్నారో సగం మద్యం ద్వారానే లాగేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది కాకుండా డిస్టిలరీల లీజులు, సబ్ లీజుల ద్వారా వచ్చే ఆదాయమెంతో చెప్పడంలేదని విమర్శలు గుప్పించారు. ఇదంతా ఒకటైతే ప్రతి కేసుపై వస్తున్న కమిషన్లు తాను చెప్పనక్కర్లేదని విజయ్ వివరించారు.

2019-20లో 3.08 లక్షల కేసుల మద్యం విక్రయించారని, 2022-03లో 3.35 లక్షల కేసుల మద్యం విక్రయించారని వెల్లడించారు. కరోనా కారణంగా 202-21లో మద్య విక్రయాలు తగ్గాయని, ఆదాయం కూడా మందగించిందన్నారు. 2022, 2023లో 30 లక్షల మద్యం కేసుల విక్రయమంటే 10 శాతం పెరిగిందన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి మద్యం విక్రయాలు తగ్గాయని అంటున్నారని ఎలా నమ్మాలో తెలియడంలేదన్నారు. మొత్తం మీద తెలంగాణకు మద్యమమే ఇంధనమని తెలుస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News