Monday, January 20, 2025

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పౌరుల వ్యక్తిగత డేటా రక్షణకోసం తీసుకువచ్చిన తొలి బిల్లు ఇదే కానుంది. బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే బిల్లు అమలుపై పని చేయడం ప్రారంభించిందని, త్వరలోనే ఈ బిల్లు అమలు మొదలవుతుందని చెప్పారు.

బిల్లును సక్రమంగా అమలు చేయడం కోసం ఏమయినా లోటుపాట్లు ఉంటే సంప్రదించడం జరుగుతుందని, తక్షణం, జాగ్రత్తగా సరిచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. చట్టాన్ని అమలు చేయడానికి 6 10 నెలల సమయం పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారని, దీన్ని అమలు చేయడానికిపై కాలపరిమితినే తీసుకోవడం జరుగుతుందని మంత్రి చెప్పారు. కొంతమంది సభ్యులు అడిగిన వివరణలకు మంత్రి సమాధానమిచ్చిన తర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News