Monday, December 23, 2024

ఆర్‌టిసి బస్సుల్లో డిజిటల్ సేవలు

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసి బస్సుల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. చిల్లర సమస్యను అధిగమించేందుకు డిజిటల్ చెల్లింపులు విధానాన్ని ప్రవేశ పెట్టే యోచనలో తెలంగాణ ఆర్‌టిసి ఉంది. ఇప్పటికే హైదరాబాద్, బండ్లగూడ డిపోలోని కొన్ని బస్సులో ్ల ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం విజయవంతంగా అమలవుతోంది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ పేరుతో ఐటిమ్స్‌సు ప్రవేశ పెట్టింది. బండ్లగూడలోని బస్సులతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో దీన్ని 3 నెలలుగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రయోగం విజయవంతం కావడం, వేరే సమస్యలు రాకపోవడం, చిల్లర బాధలు కూడా తీరడంతో తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. ప్రయాణికుడి వద్ద నగదు లేకపోయినా కార్డు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్స్ యాప్ ద్వారా బస్సులో టికెట్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఇకపై చిల్లర సమస్య అనేదే ఉండదు.

మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీనిని మరింత సులభతరం చేసేందుకు ఆర్‌టిసి యోచిస్తోంది. ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ఆర్‌టిసి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్దిదారులకు ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ వర్గాలకు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేస్తారు. వీటిని కూడా మరింత స్మార్ట్ గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News