- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. త్వరలో రాష్ట్రంలోని భూముల డిజిటల్ సర్వేపై ఆరా తీస్తున్నారు. ఈ భేటీలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సర్వే కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. డిజిటల్ సర్వే కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.400 కోట్ల కేటాయించింది. సర్వేకోసం ఏడు కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో పలు సర్వే కంపెనీలతో మంగళవారం సిఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై చర్చించారు.
Digital survey of land in Telangana
- Advertisement -