Friday, November 22, 2024

ఇంట్లోనే యూనివర్శిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని మారుమూల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్శిటీలు ఏర్పాటు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ యూనివర్శిటీ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందించనున్నట్లు ప్రకటించారు. పట్టణాలు, నగరాలకు వచ్చి ఉన్నత వి ద్యను అభ్యసించలేని దేశంలోని ఏ మా రుమూల ప్రాంతాల విద్యార్థులైనా ఉన్న త విద్యను చదువుకునేలా డిజిటల్ యూ నివర్శిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.

దేశంలో అం దరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన చేరువచేయడమే యుజిసి లక్షం అని పేర్కొన్నారు. ఆంధ్రా మహిళా సభ మహిళా క ళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరైన యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ మా మిడాల జగదీశ్‌కుమార్ ‘మన తెలంగా ణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మా ట్లాడారు. దేశంలో ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తె లిపారు. మన ప్రపంచంలోనే ప్ర ముఖ దేశంగా ఉండాలన్నదే తమ లక్షమని ఉద్ఘాటించారు. దేశంలో యువత కు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తేనే మనదేశం అన్ని రంగాల్లో రా ణిస్తుందని అన్నారు.
పూర్తిగా ఆన్‌లైన్‌లోనే
దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా విద్యార్థులు చదువుకునే అవకాశం డిజిటల్ యూనివర్శిటీలో ఉం టుందని తెలిపారు. వివిధ సబ్జెక్టుల నిపుణులు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్సిం గ్ ద్వారా విద్యార్థులకు విద్యను అందిస్తారని అన్నారు. మనదేశంలో ఏర్పాటు చేయనున్న డిజిటల్ యూనివర్శిటీలో డి గ్రీ, పిజి, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను అం దించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఉ పాధి అవకాశాలు ఉండే సాంకేతిక వి ద్య, ఫ్యాషన్, మార్కెటింగ్, బిజినెస్, సైన్స్ తదితర అనేక విభాగాల్లో పలు కో ర్సులు డిజిటల్ యూనివర్శిటీలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. సాంకేతి క విద్యను
అభ్యసించే విద్యార్థులకు పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్ ఉంటుందని అ న్నరు.

డిజిటల్ విశ్వవిద్యాలయం పూర్తిగా ఆన్‌లైన్ మాధ్యమంలో ఉంటుందని, ఇం దులో ప్రవేశాలు పొందిన విద్యార్థు లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో స్టడీస్ పూర్తిచేయవచ్చని వివరించారు. దేశం లో డిజిటల్ యూనివర్శిటీల ఏర్పాటుతో గ్రా మీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటుటోకి వస్తుందని ఆకాంక్షించారు.
తెలంగాణలో ఉన్నత విద్య మెరుగ్గా ఉంది
ఉన్నత విద్యారంగం, యూనివర్సిటీల్లో నాణ్యత ప్ర మాణాల పెంపొందించడమే ప్రాధాన్యంగా ముం దుకు సాగుతానని యుజిసి చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. మిగతా రాష్ట్రాల తో పోల్చితే తెలంగాణలో ఉన్నత విద్య చాలా మెరుగ్గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాలలో రాణిస్తున్నారని చెప్పారు. ఇంజనీరింగ్, ఐఐటి, అడ్మినిస్ట్రేషన్‌లో తెలుగు విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలు యుజిసి పంపించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేసే లా చర్యలు తీసుకోవాలని కోరారు. యుజిసి మార్గదర్శకాలపై ఏమైనా సందేహాలు ఉంటే తాము నివృత్తి చేస్తామని తెలిపారు.
వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి
రాష్ట్ర వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలకు సంబంధించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తికి ఇబ్బంది కలుగకుండా ఉండాలని యుజిసి ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. నియామకాలలో యుజి సి నిబంధనలే తుది నిబంధనలని పేర్కొన్నారు. అకడమిక్ ప్రోగ్రామ్‌లపై నిర్ణయం తీసుకోవడంలో, నియామకాలలో యూనివర్సిటీలకు పూర్తిగా స్వ యంప్రతిపత్తి ఉండాలన్నదే యుజిసి ఉద్ధేశమని చెప్పారు. తెలంగాణ వర్సిటీ ని యామకాల బిల్లుకు సంబంధించిన తమకు లేఖ వచ్చి న విషయాన్ని పరిశీలించి వెంటనే సమాధానం ఇస్తామని తెలిపారు. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉం టుందని, వర్సిటీలపై తమ అజమాయిషీ ఏమీ ఉం డదని స్పష్టం చేశారు. యుజిసి యూనివర్సిటీలకు ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుందని ఫెసిలిటేటర్(సౌజన్యకర్త)గా వ్యవహరిస్తుందని చెప్పారు.
నూతన విద్యా విధానం త్వరగా అమలు చేయాలి
నూతన విద్యా విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, దీనిని త్వరగా అమలు చేయాలని ప్రొ ఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలంటే నూతన విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల మన విద్యార్థులకు ఎంతో మెరుగైన విద్యా బోధన అందుతుంది.
ఆనర్స్ డిగ్రీతో నేరుగా పిహెచ్‌డి
దేశంలో డిగ్రీ ప్రోగ్రాంలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పిహెచ్‌డి చేయవచ్చని యుజిసి ఛైర్మన్ వెల్లడించారు. ఇందుకు సం బంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని అన్నా రు. ఆనర్స్ కోర్సులో నిర్ణీత స్కోరు పాయింట్లు సాధిం చి ఉంటే నేరుగా డిహెచ్‌డి చేయవచ్చని తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు వర్సిటీలు నేరుగా పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయని చెప్పారు. ఆనర్స్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పరిశోధన అంశాలవైపు ప్రోత్సహించేందుకు ఈ విధా నం తీసుకువచ్చామని అన్నారు.

2022-23 విద్యా సంవత్సరం నుం చి ఇది అమల్లోకి వస్తుందని, చాలా యూనివర్సిటీలు 2023 జులై నుంచి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, ఇ తర నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతోపాటు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఐఐటీలలో అమలు చేశామని చెప్పారు. డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో 75% కంటే తక్కువ మార్కుల శాతం ఉన్న విద్యార్థులకు మాత్రమే పిహెచ్ డి చేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News