పిఎం ఈ-విద్య 12 నుంచి 200 ఛానెళ్లతో విస్తరణ
న్యూఢిల్లీ : విద్యారంగానికి ప్రోత్సాహంలో భాగంగా విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడానికి వీలుగా హబ్‌స్పోక్ విధానంలో డిజిటల్ యూనివర్శిటీని నెలకొల్పడమౌతుందని, ప్రాంతీయభాషల్లో వీరికి విద్యను అనుభవజ్ఞులైన విద్యావేత్తలతో అందించడమౌతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు దీనికి తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. వృత్తి విద్యాకోర్సులో కీలకమైన ఆలోచనా పరిజ్థానాన్ని, సృజనాత్మకతను పెంపొందించే విధంగా సైన్సు, మేథ్స్‌లో 750 వర్చువల్ ల్యాబ్‌లు, 75 నైపుణ్య ఇల్యాబ్‌లు నెలకొల్పడమౌతుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం అమలవుతున్న పిఎం ఈ విద్యను 12 నుంచి 200 టివి ఛానెళ్లకు విస్తరించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా అన్ని రాష్ట్రాలు తమ ప్రాంతీయభాషల్లో విద్యార్థులకు బోధన సులువుగా నిర్వహించడానికి వీలవుతుందని తెలిపారు.