బిజెపి పాలనలో పేదరికం పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యవసర ధరలు భారీగా పెరిగియాయని పేర్కోన్నారు. భారీగా పెరిగిన ధరలతో కేంద్ర ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుందని ఆయన విమర్శించారు. ఈడీ, ఐటి, సీబీఐ దాడులతో నిర్దోషులను కూడా వేదిస్తున్నారని అన్నారు. రాహుల్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తోందని, భారత్ జోడోయాత్రను అడ్డుకునేందుకు బిజెపి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మోడీ నిర్ణయాలు సంపన్నులకు మేలు చేసేలా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. బిజెపికి ఎంఐఎం పరోక్షంగా మద్దతు ఇస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఇద్దరు టిఆర్‌ఎస్ ఎంపిలే తెలంగాణను సాధించారా… అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ వచ్చిందని ఆయన పేర్కోన్నారు.
పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : దిగ్విజయ్ సింగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -