Wednesday, January 22, 2025

దిగుడు బావులు దూరదృష్టితో ఏర్పాటు చేశారు: ఓయూ రవీందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పౌరుల అవసరాలను తీర్చడానికి దిగుడు బావులను ఏర్పాటు చేయడంలో మహా లకా బాయి దూరదృష్టి ప్రయత్నాలు చేశారని ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్ గుర్తు చేసుకున్నారు. గురువారం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ‘ఉస్మానియా యూనివర్సిటీలో వారసత్వ మెట్ల బావుల పునరుద్ధరణ‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. యూనివర్శిటీ ఎడ్డుకేషన్ డిపార్ట్ మెంట్ ఆవరణలో పునరుద్ధరించిన మెట్ల బావిని సుందరంగా తీర్చి దిద్దడంతో మెట్ల బావి కోసం పనిచేసిన కల్పనా రమేష్, ఆమె బృంద సభ్యల కృషిని అభినందించారు. పునరుద్ధరణ పనులకు సహకరించిన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి వనరులను ప్రజలు చూసే విధానాన్ని వివరించారు. ఉస్మానియా యూనివర్శిటీ విస్తీర్ణంలో మొత్తం ఏడు మెట్ల బావులు ఉన్నాయని, పునరుద్ధరణ ద్వారా నీటి వనరుల కోసం తిరిగి వాటిని వినియోగించుకోవాలని అన్నారు. కల్పనా రమేష్, ప్రెజెంటేషన్ చేసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఒక సాధారణ పట్టణ నివాసికి నీటి వనరుల గురించి పెద్దగా అవగాహన లేదని ఎప్పుడూ ట్యాంకర్, నల్లా నీళ్ల గురించే ఆలోచిస్తారని అన్నారు. వర్షపు నీటి సంరక్షణ, మన సరస్సులు, చెరువులు, మెట్ల బావుల పునరుద్ధరణ ఆవశ్యకతను ఆమె వివరించారు. ఉస్మానియా యూనివర్శిటీలో తాము చేపట్టిన రెండు స్టెప్‌వెల్‌లు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

దిగుడు బావుల పునరుద్ధరణకు సహకరించిన ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ నేతృత్వంలోని ఓయూ పరిపాలనా విభాగానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ మూర్తి, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ టి. మృణాళిని, డాక్టర్ పి. శంకర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహూతులను ఆకర్షించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News