Wednesday, January 22, 2025

ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు

- Advertisement -
- Advertisement -

Union Jal Shakti Ministry holds key meeting on Polavaram

ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు

పోటీ నుంచి తప్పుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి

దిగ్విజయ్, థరూర్‌తో పాటు తెరపైకి ముకుల్ వాస్నిక్
మాది దోస్తీ కుస్తీ దిగ్విజయ్ సింగ్ పోటీపై శశిథరూర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో ఎవరెవరు నిలవబోతున్నారన్న ఉత్కంఠకు తెరపడింది. రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మరో సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ గురువారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి, కేరళకు చెందిన శశిథరూర్ కూడా నామినేషన్ పత్రాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి నడుమే ఎఐసిసి చీఫ్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా శుక్రవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 30 (నేడే). ఇదిలావుండగా మరో సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్ పేరు కూడా తాజాగా రేసులో ఉండబోయే నాయకుల్లో ఒకరిగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన పేరును కూడా పలువురు నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పోటీ పడుతున్న దిగ్విజయ్, థరూర్ ఇద్దరు పార్టీకి విధేయులే అయినప్పటికీ గతంలో వివాదాలు వారికి ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని, విపక్షాలకు మనమే ఆస్కారం ఇచ్చిన వాళ్లం అవుతామన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దిగ్విజయ్ పలు సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు పారీని ఇరుకున పడేసేవిగా ఉంటాయని కూడా అనమానాలున్నాయి. ఇప్పటికే వాస్నిక్ కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. బరిలో నుంచి తప్పుకున్న రాజస్థాన్ సిఎంతో కూడా శుక్రవారంనాడు సమావేశమైన తర్వాత వాస్నిక్ నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన దళిత నాయకుడైన ముకుల్ వాస్నిక్ దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి బాలకృష్ణ వాస్నిక్ కుమారుడు. ముకుల్‌కు రాజకీయ, పాలనా రంగాల్లో మంచి అనుభవం కూడా ఉంది.
ఔను..బరిలో ఉంటున్నా: దిగ్విజయ్
మరోవైపు పార్టీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందుకున్న తర్వాత దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ‘ఔను బరిలో ఉంటున్నా. ఇవిగోండి నామినేషన్ పత్రాలు’ అని చూపెట్టారు. అనంతరం సోనియా నివాసానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శశిథరూర్‌ను దిగ్విజయ్ సింగ్ స్వయంగా కలిశారు. తమ ఇద్దరి మధ్య ఇది శత్రువుల మధ్య పోరు వంటిది కాదని, కేవలం స్నేహపూరిత పోటీ, అది కూడా సహచరుల మధ్య జరిగేది అని థరూర్ తెలిపారు. గురువారం నాడు మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్ తనను కలిశారని, పార్టీ అధ్యక్షస్థానానికి ఆయన అభ్యర్థిత్వాన్ని తాను ఆహ్వానిస్తున్నానని థరూర్ వెల్లడించారు. పరస్పర కుశలం తరువాత పోటీ విషయం వచ్చిందని, సై అంటే సై అనుకోకుండా ఓకె ఒకె అంటే ఓకె అనుకున్నామని థరూర్ చమత్కరించారు. ఎవరు గెలిచినా ఓడినా అఖిల భారత కాంగ్రెస్ విజయం సాధించాలనేదే ఆలోచన అన్నారు. శుక్రవారం తన నామినేషన్ ఉంటుందని తెలిపారు. థరూర్ వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందించారు. ఆయన మాటలతో ఏకీభవిస్తున్నానని, తాము దేశంలోని మతతత్వశక్తులతో పోరాడుతున్నామని , ఇరువురం గాంధీనెహ్రూవాద సిద్థాంతాలను విశ్వసించే వారమని స్పందించారు.

Digvijay Singh received Nomination Papers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News