Sunday, December 22, 2024

మోడీ షాలకు సద్బుద్ధి కలగాలి: దిగ్విజయ్

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం ప్రధాని మోడీ, అమిత్ షాలకు చురకలు పెట్టారు. తాను వారి అభిమానిని అని , వారికి సద్బుద్ధి కలుగుగాక అని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ నేత ఎంఎస్ గోల్వాల్కర్‌పై దిగ్విజయ్ ట్వీటు వివాదానికి దారితీసింది. బిజెపి ఫిర్యాదుతో ఆయనపై కేసు దాఖలు అయింది. ఈ దశలో సింగ్ స్పందిస్తూ అన్నింటిని అర్థం చేసుకునే శక్తి మోడీ, షాలకు అందాలని వ్యాఖ్యానించారు. ఇది మరింత వివాదాస్పదం అయ్యేలా ఉంది. దళితులు, ముస్లింలు, బిసిలకు సమాన హక్కులు కల్పించడం జరిగితే తాను

బ్రిటిష్ పాలనలో గడపడటం మంచిదని ఆర్‌ఎస్‌ఎస్ నేత చెప్పినట్లు దిగ్విజయ్ సింగ్ ట్వీటు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ తప్పుపట్టారు. ఇది తప్పుడు సమాచారం, విద్వేషపూరితం అన్నారు. అయితే తాను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని, అయినా ప్రధాని మోడీ , షాలు తన పిరికిపందలు అయిన విద్రోహులను ఇప్పుడు కొనియాడుతున్నారని, ఇంతకు ముందు వీరిని తిట్టినవారిని చేరదీస్తున్నారని తెలిపిన సింగ్ ఈ వ్యక్తులు మోడీ అధికారం వీడిన మరుక్షణం ఆయనను వీడుతారని తెలిపారు. వారి కష్టకాలంలో మద్దతు తెలిపిన వారిని ఇంటికి పంపించారని, తిట్టిన వారిని అందలం ఎక్కించారని, ఇవన్నీ తెలుసుకునే శక్తి వీరికి అబ్బాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News