Monday, December 23, 2024

ఇంతకూ అయోధ్య పాతరాముడేడి ?

- Advertisement -
- Advertisement -

కొత్త విగ్రహ ప్రతిష్టపై దిగ్విజయ్ ప్రశ్న

ఇండోర్ : ఈ నెలలో అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక ప్రశ్న లేవనెత్తారు. రాముడి ప్రతిష్ట ఏ హిందువుకు అయినా ప్రాణప్రదమే అవుతుంది. అయితే సరికొత్తగా నిర్మించిన అయోధ్య రామాలయంలో రాముడి కొత్త విగ్రహ స్థాపన ఎందుకు? మరి అత్యంత పురాతనమైన పూర్వపు రామ్‌లల్లా విగ్రహం ఎక్కడుంది? ఎటుపోయింది? ఉంటే దీనిని ఇప్పుడు శాస్త్రం ప్రకారం అక్కడ ఎందుకు ప్రతిష్టించడం లేదు? అని ఈ కాంగ్రెస్ ఎంపి ప్రశ్నించారు.

నిజానికి సామాజిక రాజకీయ సంస్థలపరంగా , చివరికి కోర్టుల పరంగా కూడా ప్రధాన వ్యాజ్యం అంతా కూడా పురాతన రామ్‌లల్లా గురించే కదా? మరి దీనిని మరింత వివాదాస్పదం చేసేలా పాత విగ్రహాన్ని దాచిపెట్టి, వినూత్న నగిషీలు, విశేష ప్రచారాలతో సరికొత్త విగ్రహ స్థాపనకు ఎందుకు దిగారు? దీని వెనుక ఉన్న అంతర్లీన ధర్మసందేహాలు ఎవరు తీరుస్తారు? అని దిగ్విజయ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News