Monday, January 20, 2025

‘సెల్ఫిష్’ నుంచి ‘దిల్‌ఖుష్’ లిరికల్ వీడియో విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆశిష్, లవ్ టుడే ఫేం ఇవనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సెల్ఫిష్’. సినీ ఇండస్ట్రీలోకి ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ కి ఇది రెండో చిత్రం. కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆశిష్ పాతబస్తీ యువకుడిగా నటిస్తున్నాడు. సోమవారం ఆశిష్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ‘దిల్‌ఖుష్’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాగా,  మిక్కి.జే.మేయర్ సంగీత సారథ్యంలో జావేద్ అలి ఆలపించిన ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది.  కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News