Tuesday, January 7, 2025

టికెట్ రేట్స్ పెంచితే.. ప్రభుత్వానికి ఆదాయం: దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ఒకటి.. డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్ కాగా.. మరోకటి, వెంకటేష్-అనిల్ రావుపూడి కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం. మొదట గేమ్ ఛేంజర్ సినిమా ఈ నెల 12న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణలో టికెట్స్ రేట్ల పెంపు దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రేట్లు పెంచినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తెలంగాణలో కూడా సానుకూలంగా స్పందిస్తారో లేదో చూడాలన్నారు. “నిర్మాతగా టికెట్ రేట్లపై నా ప్రయత్నం చేస్తాను.. టికెట్ రేట్స్ పెంచడం వల్ల 18 శాతం ప్రభుత్వానికి వెళ్తుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలి” అని దిల్ రాజు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News