Monday, December 23, 2024

షూటింగ్స్ బంద్‌పై గందరగోళం..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ బంద్‌పై గందరగోళం నెలకొంది. సోమవారం నుంచి షూటింగ్‌లు నిలిపి వేయాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతలు ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి సోమవారం చిత్రీకరణలు నిర్వహించారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘వారసుడు’, ధనుష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘సార్’ చిత్రాల షూటింగ్‌లు యథావిధిగా జరిగాయి. దీంతో కొందరు నిర్మాతలు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఇక షూటింగ్‌లు నిలిపి వేయాలని తమకు ఎలాంటి నోటీస్ అందలేదని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఛాంబర్ అప్రమత్తమైంది. చిత్రీకరణలు నిలిపివేయడంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా లేఖ పంపనుంది. ఈ విషయంపై ఫిల్మ్‌ఛాంబర్ నూతన అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడిగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.
దిల్‌రాజు వివరణ…
ఇక దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘వారసుడు’ చిత్రం తెరకెక్కుతుండగా… సితారా బ్యానర్‌లో ధనుష్ నటిస్తున్న ‘సార్’ చిత్రం కూడా తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతోంది. ఇక సోమవారం జరిగిన ‘వారసుడు’ సినిమా షూటింగ్‌పై దిల్ రాజు వివరణ ఇచ్చారు. తాను తెలుగు సినిమా షూటింగ్ చేయట్లేదని చెప్పారు. విజయ్ హీరోగా తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సినిమా చిత్రీకరణపై నెలకొన్న పరిస్థితిపై వివరణ ఇచ్చారు. “తెలుగు సినిమాల షూటింగ్స్ మాత్రమే బంద్ చేస్తున్నాం. నేను విజయ్‌తో షూటింగ్ చేస్తున్నది తమిళ సినిమా” అని దిల్ రాజు అన్నారు.

Dil Raju Clarity on Controversy of ‘Varasudu’ Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News