Tuesday, February 4, 2025

ముగిసిన దిల్ రాజు విచారణ.. ఆ వివరాలపై అధికారుల ప్రశ్నలు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ ప్రడ్యూసర్, ఎఫ్ డిసి చైర్మైన్ దిల్ రాజు విచారణ ముగిసింది. ఆయన బ్యానర్ నుంచి రిలీజైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు సంబంధించిన బిజినెస్ అకౌంట్స్ వివరాలు అడిగినట్లు సమాచారం. రెండు గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు.

కాగా.. గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకరావాలని దిల్ రాజుకు నోటీసులు పంపారు.  జనవరి 21న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐటి సోదాలు అనేది కామన్‌.. అకౌంట్‌ బుక్స్‌ చెక్‌ చేసి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని, మా ఇంట్లో రూ.20 లక్షల లోపే డబ్బులు ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News