Thursday, January 23, 2025

దిల్‌రాజు వారసుడు వచ్చాడు..

- Advertisement -
- Advertisement -

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రయ్యాడు. దిల్‌రాజు భార్య తేజస్విని బుధవారం ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దిల్ రాజుకు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ల వర్షం కురిపించారు. ఇక 2020 డిసెంబర్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. దిల్ రాజుకు ఇది రెండో వివాహం. దిల్ రాజు మొదటి భార్య అనిత. ఆయన నిర్మించిన చాలా సినిమాలకు ఆమె సమర్పకురాలిగా కూడా వ్యవహరించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో కన్నుమూశారు. వీరికి హన్షితా రెడ్డి అనే కుమార్తె వుంది. మొదటి భార్య మరణానంతరం నిర్మాత దిల్ రాజు వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండవ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు బాలీవుడ్‌లో ‘హిట్: ది ఫస్ట్ కేస్’ని రాజ్ కుమార్ రావుతో రీమేక్ చేస్తున్నారు. అంతే కాకుండా తెలుగులో రెండు బారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి, దళపతి విజయ్‌లతో బైలింగ్వల్ మూవీతో పాటు రామ్ చరణ్,  శంకర్‌ల కాబినేషన్‌లో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు భారీ చిత్రాలు నిర్మాణ దశలో వున్నాయి.

Dil Raju Couple blessed with Baby Boy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News