Wednesday, January 22, 2025

సినిమాలను ఎవరు తొక్కాలని చూడరు: దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

Dil raju explains on karthikeya part-2 release

హైదరాబాద్: కార్తికేయ పార్ట్-2 విడుదల విషయంలో తనపై జరిగిన ప్రచారంపై నిర్మాత దిల్ రాజు మంగళవారం వివరణ ఇచ్చాడు. సినిమాలను ఎవరు తొక్కాలని చూడరని చెప్పారు. ‘థ్యాంక్యూ’ విడుదల విషయంలో సహకరించాలని కార్తికేయ-2 నిర్మాతల్ని కోరానని ఆయన తెలిపారు. హీరో నిఖిల్, దర్శకుడితో మాట్లాడి థ్యాంక్యూ సిన్మాను విడుదల చేశామని వివరించారు. కార్తికేయ-2ను మరో తేదీన విడుదల చేసేందుకు సహకరించానని దిల్ రాజు చెప్పుకొచ్చారు. పీపుల్స్ మీడియా సంస్థ పరిశ్రమలో నంబర్ వన్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక సినిమా విజయం సాధిస్తే మరో సినిమాకు ఊపిరిపోస్తుందన్నారు. ”నేను సినిమా కోసం ప్రాణమిచ్చే మనిషిని” అని దిల్ రాజు తెలిపారు. పొరపాటు చేస్తే మీడియా ముఖంగా క్షమాపణ చెబుతానని ఆయయ వెల్లడించారు. అవాస్తవాలు రాసే ముందు నిజాలు తెలుసుకుని రాయండని దిల్ రాజు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News