ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు క్వాంటం ఎఐ గ్లోబల్‌తో చేతులు కలిపి కొత్త ఎఐ ప్రోడక్ట్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి స్మార్ట్ టూల్స్ రూపొందించడంపై దృష్టి పెడుతుంది. ఎఐ -ఆధారిత సాధనాలు అందించడం ద్వారా కంటెంట్ క్రియేటర్స్, స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సహాయం చేయడం, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, ప్రీ విజువలైజేష్, ఎడిటింగ్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సృజనాత్మక విధానంలో ప్రతి భాగానికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. కంపెనీ పేరు, ప్రోడక్ట్ లిస్టు, లాంచ్ వివరాలను మే 4న తెలియజేస్తారు. ఈ సందర్భంగా దిల్ రాజు తన ఆలోచనలు పంచుకున్నారు. “ఇది కేవలం మెరుగైన కంటెంట్ గురించి మాత్రమే కాదు, మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌కి మద్దతు ఇచ్చే బలమైన ఎఐ వ్యవస్థ నిర్మాణం గురించి. క్వాంటం ఎఐ గ్లోబల్ సాంకేతిక నైపుణ్యాలతో, సృజనాత్మకతతో శక్తివంతమైన, భవిషత్తుకు సిద్ధంగా ఉన్న సొల్యుషన్స్ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము”అని అన్నారు.
ఎఐతో సినిమాలు…. కొత్త కంపెనీని ప్రారంభించిన దిల్ రాజు
- Advertisement -
- Advertisement -
- Advertisement -