Wednesday, January 22, 2025

ఫిలింఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫిలింఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ విజయం సాధించింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలిచింది. డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో రెండు ప్యానల్స్‌ నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు. గ్జిబిటర్స్‌ సెక్టార్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్‌రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఫిలిం ఛాంబర్‌ వర్గాలు తెలిపాయి.

స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ సభ్యులు ఉన్నట్లు సమాచారం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. దిల్ రాజు ప్యానల్, సీ కల్యాణ్ ప్యానల్ మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మొత్తం 4 విభాగాలు.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్లు.. ఫిలిం ఛాంబర్‌లో మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News