Monday, December 23, 2024

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ‘బ‌ల‌గం’ ఓ చ‌రిత్ర‌..

- Advertisement -
- Advertisement -

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ‘బ‌ల‌గం’ ఓ చ‌రిత్ర‌.. మా బాధ్యతను మరింత పెంచింది: నిర్మాత దిల్ రాజు

దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3న విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆద‌ర‌ణ పొందుతూ దూసుకెళ్తోంది. పల్లెటూళ్ల‌లో అయితే తెర‌లు ఏర్పాటు చేసుకుని ఊరు ఊరంతా క‌లిసి సినిమాను చూస్తున్నారు.. ఎమోష‌న‌ల్ అవుతున్నారు. అలాగే బ‌ల‌గం సినిమాకు 7 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో దిల్ రాజు, ద‌ర్శ‌కుడు వేణు, నిర్మాత‌లు హ‌ర్షిత్, హ‌న్షిత త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో

దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మంచి సినిమా తీస్తున్నామని, మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో బలగం సినిమాను మొదలు పెట్టాం. కానీ ఈరోజు అదొక చ‌రిత్ర‌. తెలుగు సినిమాలో బ‌ల‌గం ఓ మైలురాయిలా నిల‌బ‌డిపోయేలా ముందుకెళుతోంది. చిన్ని సినిమా ప్రారంభ‌మైన‌ప్పుడు ఈ సినిమాను ముందుగా చూసిన మీడియా మిత్రులు ఇచ్చిన అప్రిషియేష‌న్స్‌ను మేం మ‌ర‌చిపోలేక‌పోతున్నాం. ఇప్పుడు సినిమా విడుద‌లై 5 వారాలు అవుతున్న‌ప్ప‌టికీ సినిమా గురించి రోజూ ఏదో ఒక వార్త‌లు వింటూనే ఉన్నాం. సినిమా వాళ్లే కాకుండా మినిష్ట‌ర్స్‌, ఎమ్మెల్యేలు వీళ్లు వాళ్లు అని కాకుండా అప్రిషియేట్ చేశారు. నా నెంబ‌ర్ లేక‌పోతే అడిగి మ‌రీ తీసుకుని మాట్లాడుతున్నారు.

సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బ‌ల‌గం ఎప్పుడూ నిల‌బ‌డిపోయే ఓ చ‌రిత్ర‌. ఆంద్రాలో 16 ఎం.ఎం క‌ల్చ‌ర్ ఉండేది. ఫెస్టివ‌ల్స్ స‌మ‌యంలో అన్ని సినిమాలు తీసుకొచ్చి చూసేవాళ్లు. నేను 9 వ త‌ర‌గ‌తి చ‌దివేట‌ప్పుడు నేను చ‌దువుకునే రోజుల్లో 16 ఎం.ఎంపై సినిమాల‌ను వేసేవాడిని. అప్పుడు నాతో పాటు ఉండే నా స్నేహితుడు ఫోన్ చేసి ఆ సంగ‌తుల‌ను గుర్తు చేస్తే ఇప్పుడు ప‌ల్లె ప‌ల్లెలో మీ బ‌లగం మారు మోగుతోంది. నాకేమీ అర్థం కావ‌టం లేదు. ఆరోజు నీ ఆలోచ‌న నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు నువ్వే ఒక నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసి బ‌లగం వంటి సినిమా తీసి ఊళ్లు ఊళ్లు క‌దిలిస్తున్నావ‌ని అన్నాడు.

వేణు నిన్న ఒక వీడియో పంపాడు. అందులో అన్న‌ద‌మ్ములు ఈ సినిమా చూసి ఊరి స‌ర్పంచు ముందు క‌లిసిపోయారు. అలాగే ఓ కుటుంబంలో విడిపోయిన వారంద‌రూ క‌లిసి బ‌ల‌గం సినిమాను చూశారు. బుధ‌వారం (ఏప్రిల్ 5)కి నిర్మాత‌గా నేను జ‌ర్నీ స్టార్ట్ చేసి 20 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో బొమ్మ‌రిల్లు స‌మ‌యంలో నాకొక అనుభూతి. ఆ సినిమా చూసిన త‌ర్వాత చాలా మంది పేరెంట్స్‌లో మార్పు వ‌చ్చింది.

బ‌లగం సినిమా గురించి వేణు చెప్పిన‌ప్పుడు ఇదొక మంచి ప్ర‌య‌త్న‌మ‌ని చేశాం. ఈరోజు అదే సినిమా ద్వారా కుటుంబాల్లో క‌ల‌యిక వ‌చ్చి క‌లుస్తున్నారు. ముందుగా వేణుకి థాంక్యూ. తెలుగు సినిమా చరిత్ర‌లో బ‌ల‌గంకు ఓ పేజీ ఉంటుంది. ప‌ల్లెటూళ్ల‌లో బ‌లగం సినిమా షో ఉంటుంద‌ని ఇన్వెటేష‌న్ రెడీ చేసుకుని మ‌రీ చూస్తున్నారు. ఇలాంటి మూమెంట్ మ‌ళ్లీ ఎప్పుడు చూస్తామో తెలియ‌దు. ఇక థియేట‌ర్స్‌లో 5 వారాలైన‌ప్పటికీ ఇంకా షేర్ క‌లెక్ష‌న్స్ రావ‌టం గొప్ప విష‌యం.

హర్షిత్‌, హ‌న్షిత‌లు బ‌ల‌గం సినిమాను రిలీజ్ చేయ‌టాని కంటే ముందే ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల‌కు పంపారు. 7 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయి. అందులో రెండు అవార్డులు డైరెక్ట‌ర్ వేణుకి, ఒక‌టి హీరోకి, ఒకటి హీరోయిన్‌కి ఇలా అవార్డులు వ‌చ్చాయి. 20 ఏళ్ల‌లో 50 సినిమాలు చేశాను. ఇన్నేళ్లో ఏ సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్ రాలేదు. ఫ‌స్ట్ టైమ్ వ‌స్తుంది. మా పిల్ల‌లు ఇంట‌ర్నేష‌న‌ల్‌కి వెళ్లారు. ఇప్పుడు వాళ్ల రెస్పాన్సిబిలిటీ మ‌రింత పెరిగింది.

మొన్న మోహ‌న్‌బాబుగారు ఫోన్ చేసి ఏం సినిమా తీశార‌య్యా అని అప్రిషియేట్ చేశారు. హ‌ర్షిత్, హ‌న్షిత‌లు వెళ్లి ఆయ‌న్ని క‌లిసొచ్చారు. సినిమా ఇండ‌స్ట్రీతో పాటు అటు రాజ‌కీయ నాయ‌కులు సైతం మా బ‌ల‌గం సినిమాను అభినందిస్తున్నారు. శాటిస్ఫాక్ష‌న్‌తో పాటు బాధ్య‌త పెరిగింది. వేణు, ద‌ర్శి అండ్ టీమ్‌కు థాంక్స్‌. క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌టి చేశారు కాబ‌ట్టి ఓ అద్భుతం జ‌రిగింది. ఇలాంటి అద్భ‌తం చేస్తామో చూడాలి. ఇప్ప‌టికే అన్వేషణ స్టార్ట్ అయ్యింది.

ప‌ల్లెటూళ్ల‌లో మేమేదో షోను ఆపుతున్నామంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. జనాలు ఎలాగైనా మంచి సినిమాను చూడాల‌నే బ‌ల‌గంను రూపొంచాం. మంచి సినిమా చేశామ‌ని అనుకున్నాం కానీ.. గొప్ప సినిమా చేశామ‌ని ఇప్పుడే తెలిసింది. మా ద్వారా కుటుంబాలు క‌లిసి పోతున్నాయి. సోసైటీ మార్పు వ‌స్తుందంటే అంత కంటే గొప్ప ఏముంది. మా జ‌న్మ ధ‌న్య‌మైంది. కానీ మేం ఏదో లీగ‌ల్‌గా సినిమాను ఆపేస్తామ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

నిజానికి నిర్మాత‌గా ఈ సినిమా హ‌క్కుల‌ను నేను ఓటీటీ వాళ్ల‌కి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ల సైడ్ నుంచి మాకు ప్రెష‌ర్ వ‌చ్చింది. వాళ్లు మెయిల్ పెట్టారు. దాని కోసం మా లీగ‌ల్ టీమ్ ఏదో చేసింది కానీ.. ఇది ఆగ‌దు. నేను చెప్పేది ఒక్క‌టే ఈ సినిమా ఎక్క‌డా ఆగ‌దు. ఓపెన్‌గా ఎక్క‌డ ఎలా చూడాల‌నుకుంటే అలా చూడండి. ఎక్క‌డైనా సినిమా చూడాల‌నుకుంటే మేం కాంటాక్ట్ నెంబ‌ర్ ఇస్తాం. మేం షోస్ అరెంజ్ చేస్తాం. నాకొస్తున్న పేరుని ఓ బ్యాచ్ త‌ట్టుకోలేదు. వెంట‌నే ఏదో స్టార్ట్ చేస్తారు. నేను నిజాయ‌తీగా ఉన్నాను. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

బ‌ల‌గం సినిమాను ఆస్కార్‌కు క‌చ్చితంగా పంపించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఏదో బ‌డ్జెట్ పెట్టాల‌నే వార్త‌లు వచ్చాయి. నేను కూడా కార్తికేయ‌తో దాని గురించి మాట్లాడాను. నిజానికి యుఎస్‌లో స్ట్రీమింగ్ చేయ‌టానికి కొంత బ‌డ్జెట్ పెట్టాలి. అదే వాళ్లు పెట్టారు. ఇక ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ సినిమా విషయానికి వ‌స్తే వాళ్లేం బ‌డ్జెట్ పెట్ట‌లేదుగా’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News