Wednesday, January 22, 2025

Balagam: ‘బలగం’ను ఆస్కార్‌కు పంపిస్తాం

- Advertisement -
- Advertisement -

“నిర్మాతగా 20 ఏళ్లలో 50 సినిమాలు చేశాను. ఇన్నేళ్లలో ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు. తొలిసారి ‘బలగం’ సినిమాకు 7 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి” అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. దిల్‌రాజు సారధ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ..“మంచి సినిమా తీస్తున్నామని,మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో బలగం సినిమాను మొదలుపెట్టాం.

కానీ ఈరోజు అదొక చరిత్ర. తెలుగు సినిమా చరిత్రలో ‘బలగం’ ఓ మైలురాయిలా నిలబడిపోయేలా ముందుకెళ్తోంది. సినిమా ప్రముఖులే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. పల్లెటూళ్లలో అయితే తెరలు ఏర్పాటు చేసుకొని ఊరు ఊరంతా కలిసి ఈ సినిమాను చూస్తున్నారు. అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఓ రోజు మోహన్‌బాబు ఫోన్ చేసి ఏం సినిమా తీశావయ్యా అని ప్రశంసించారు. ఇక బలగం సినిమాను ఆస్కార్‌కు ఖచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News