Saturday, December 21, 2024

మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ‘ఆకాశం దాటి వస్తావా’..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నం.2గా రూపొందుతోన్న సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. కార్తీక మురళీధరన్ హీరోయిన్. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా విడుదల చేశారు. శశికుమార్ ముతులూరి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ.. “కొరియోగ్రాఫర్ యష్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాం. సింగర్ కార్తీక్ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఇదొక మంచి మ్యూజికల్ మూవీ” అని అన్నారు. దర్శకుడు శశికుమార్ మాట్లాడుతూ.. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో యష్, కార్తీక మురళీధరన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News