Thursday, January 16, 2025

చిక్కడపల్లి పిఎస్ కు దిల్ రాజ్, డైరెక్టర్లు..

- Advertisement -
- Advertisement -

అల్లుఅర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. బన్నీని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న దిల్ రాజు, పలువురు డైరెక్టర్లు పిఎస్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే భారీగా అభిమానులు తరలివచ్చారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న అల్లుఅర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనంతరం అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అల్లుఅర్జున్ రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, హైకోర్టులో అల్లుఅర్జున్ ఎమర్జెన్సీ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ కేసులో లంచ్ మోషన్ పిటిషన్ పై మధ్యాహ్నం 2.30గంటలకు కోర్టు విచారణ జరపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News