అక్కికేని నాగచైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్స్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష్‌న్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతుంది. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
పాయింట్ బాగా నచ్చింది…
నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలను నా లైఫ్‌తో పోల్చుకోలేదు. ఇప్పుడు ‘థాంక్యూ’ని పోల్చుకున్నాను. రైటర్ రవి నాలుగేళ్ల క్రితం ఈ స్టోరీని నాకు చెప్పారు. నాకు ఇందులోని పాయింట్ బాగా నచ్చింది.
మంచి కథ చేశాం…
ఈ సినిమాలో కాలేజ్, టీనేజ్, లైఫ్… అన్నింటినీ డిజైన్ చేశాం. రవి ఐడియాని మేం అందరం కూర్చొని డిజైన్ చేసి మంచి కథ చేశాం. ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటుందా? అని ఆలోచించాం. అప్పుడు నాకు విక్రమ్ గుర్తొచ్చాడు. విక్రమ్‌కి ఈ పాయింట్ చెప్పగా అతనికి బాగా నచ్చింది. స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్ స్టైల్‌లో రాయమని అతనికి ఇచ్చాను.
అన్నీ కలిపితే ఈ సినిమా…
బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, కమర్షియల్ యాంగిల్స్ అన్నీ కలిపితే ఈ సినిమా. ఈ సినిమాను డిజైన్ చేయడం బిగ్ జర్నీ. ‘ప్రేమమ్’లాగా మూడు స్టోరీలున్నాయి. ‘ఆటోగ్రాఫ్’లాగా ఉంది అని అనడం కూడా విన్నాను.
నాకు సూపర్ అనిపించింది…
విక్రమ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘చైతన్య ఎలా ఉంటాడు?’ అని అన్నాడు. నాకు సూపర్ అనిపించింది. చైతన్య కథ విని మూడు లుక్స్‌కి రెడీ కావాల్సిన క్యారక్టర్ అయినా వెంటనే ఓకే చెప్పాడు. చైతన్య ఎక్స్‌ట్రార్డినరీ జాబ్ చేశాడు.
ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది…
ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్‌సెట్ మారింది. దీంతో మమ్మల్ని మేము మార్చుకోవాలి. ప్రస్తుతం 10 స్క్రిప్టులు, రెండు షూటింగులను ఆపేశా. 2023లో ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా మారిందో అర్థం చేసుకొని సినిమాలు చేయాలి.
కొత్త ఇండస్ట్రీ చూస్తారు…
మంచి కంటెంట్ ఇచ్చి టిక్కెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గారు. ఇక, నెల రోజుల్లో ఇండస్ట్రీని అందరూ కొత్తగా చూస్తారు. మిడ్ రేంజ్ నుంచి టాప్ స్టార్‌ల సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది పది వారాలకా? ఎప్పటికా? అనేది ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం.
Dil Raju Special Interview about ‘Thank You’