Wednesday, January 22, 2025

‘బలగం’కు మొదటి హీరో దిల్‌రాజు

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా విశ్వ విజయ శతకం ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో వంద రోజుల ఫంక్షన్లు చూశాను.. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటి సారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నా. ఈ కథను మా దగ్గరకు తీసుకొచ్చిన వేణుకి, వేణుని మా దగ్గరికి తీసుకొచ్చిన ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరాంకు థాంక్స్. బలగం ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం వాళ్లే. ఈ సినిమాలో నటీనటులందరిరూ నటించలేదు. జీవించారు.

అందుకే ఇంత అద్భుతమైన విజయం వచ్చింది. అందుకే వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. మళ్లీ ఇలాంటి అద్భుతాలు జరుగుతాయో లేదో తెలిదు. అందుకే ఈ రోజు ఇలా ఈవెంట్ చేసుకుంటున్నాం’ అని అన్నారు. వేణు యెల్దండి మాట్లాడుతూ.. ‘మూలాల్లోంచి రాసుకున్న కథ, అంతే సహజంగా తీయాలని అనుకున్నాను. అందుకే ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ చూశాను. అవార్డులు వచ్చిన సినిమాలు చూశాను. కానీ నా సినిమాకే వంద అవార్డులు వచ్చాయి. బలగం సినిమాకు మొదటి హీరో దిల్ రాజు. ఆయన నమ్మడం వల్లే ఈ సినిమా ప్రారంభమయింది. చిన్న సినిమాను నమ్మి పెద్ద ఎత్తుకు తీసుకెళ్లారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హన్షిత, కావ్యా కళ్యాణ్ రామ్, ప్రియదర్శి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News