Monday, December 23, 2024

శిథిలావస్థలో విద్యుత్ స్తంభాలు

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎస్‌ఎంసీ చైర్మన్ రామోల్ల రమేష్ అన్నారు. మండల కేంద్రమైన లోకేశ్వరంలో ప్రతి వార్డులో పడిపోయిన విద్యుత్ స్తంభాలు ఉన్నాయని కొత్తవి వేయటం లేదని కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలకు బదులు కొత్తవి వేసి పాతవితొలగించకపోవడంతో అవి కొత్తవాటిపై ఒరిగాయని తద్వారా రెండు పడిపోయి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News