Friday, July 5, 2024

దిలీప్ ఘోష్ కారుపై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ, పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. బర్దమాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా, కల్నాగేట్‌లో బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పలు ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రానికి దిలీప్‌ఘోష్ వెళ్తుండగా, ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ మద్దతు దారులు ఆయన కారుని అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోడానికి ప్రయత్నించగా, కొందరు ఘోష్ కారుపై రాళ్లు రువ్వగా ఘోష్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఘోష్ వెంటనే పక్కనే ఉన్న ఓ మీడియా వాహనం లోకి చేరుకుని బయటపడ్డారు. మీడియా కెమెరామెన్ కాలికి కూడా గాయమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News