- Advertisement -
ముంబయి: మహారాష్ట్ర నూతన హోం మంత్రిగా ఎన్‌సిపి నాయకుడు దిలీప్ వాల్సే పాటిల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల కారణంగా తన పదవికి రాజీనామా చేసిన అనీల్ దేశ్‌ముఖ్ స్థానంలో పాటిల్ నియమితులయ్యారు. పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలను పురస్కరించుకుని దేశ్‌ముఖ్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు పాటిల్ విలేకరులకు తెలిపారు. పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మహిళల భద్రత, శక్తి చట్టం ఆమోదం, పోలీసు సిబ్బందికి గృహకల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని ఆయన తెలిపారు.
Dilip Patil takes over as Maharashtra Home Minister
- Advertisement -