Thursday, March 13, 2025

హోలీ పండుగను ‘దిల్ రూబా’తో సెలబ్రేట్ చేసుకోండి

- Advertisement -
- Advertisement -

సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగ మ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ ని ర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూబా సిని మా శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబా ద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి మాట్లాడు తూ – “ఈ సినిమా విషయంలో కిరణ్ మా కంటే ఎక్కువగా కథను, దర్శకుడినీ నమ్మా రు. ‘దిల్ రూబా’తో కిరణ్‌కి, మా టీమ్ అందరికీ విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం”అ ని అన్నారు. డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడు తూ “కిరణ్ ఈ సినిమాలో చేసిన ఫైట్స్, చె ప్పే డైలాగ్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

ఇ టీవల ‘దిల్ రూబా’ సినిమా చూసి కిరణ్ ‘టెన్షన్ పడకు సినిమా అదిరిపోయింది’ అన్నా రు. అదే నమ్మకంతో చెబుతున్నా ఈ నెల 14 న థియేటర్స్ కు వెళ్లండి. ఒక కొత్త కిరణ్ అబ్బవరంను స్క్రీన్ మీద చూస్తారు”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “దిల్ రూబా సినిమాకు సామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ నెల 14 న కాదు 13న సాయంత్రమే ‘దిల్ రూబా’ ప్రీ మియర్స్‌తో మా సక్సెస్ జర్నీ ప్రారంభం కా బోతోంది. హోలీ పండుగను మా మూవీతో కలిసి థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకోండి. సి నిమా 2 గంటల 20 నిమిషాల్లో ఎక్కడా బోర్ ఫీల్ కారు. క సినిమాలో కంటెంట్ చూశారు. ‘దిల్ రూబా’లో కిరణ్ అబ్బవరంను చూస్తా రు. విశ్వకరుణ్ నన్ను సినిమాలో చూపించిన విధానం, నాతో చెప్పించిన డైలాగ్స్ మిమ్మ ల్ని ఆకట్టుకుంటాయి”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు క్యాతీ డేవిసన్, రుక్సర్ థిల్లాన్, ప్రొడ్యూసర్ రవి, గోపీనాథ్ రెడ్డి, ఈశ్వర్ పెంటి, జితు, సుధీర్, డేనియల్ విశ్వాస్, జాన్ విజయ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News