ఐపిఎల్ ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ దిల్షాన్ మధుశంకా(శ్రీలంక)కు గాయమైంది. తొడ కండరాల గాయంతో బాధపడతున్న మధుశంకా ఐపిఎల్ 17వ సీజన్ మొదటి దశకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐపిఎల్ వేలంలో మధుశంకను ముంబై రూ.4.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. దాంతో ఆట మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. 6.4 ఓవర్లు మాత్రమే మధుశంక బౌలింగ్ చేశాడు. మధుశంకను ఆస్పత్రికి తరలించి..
స్కాన్ చేయగా గాయం తీవ్రమైనది స్పష్టం అయింది. దాంతో బంగ్లాతో ఆదివారం జరిగిన మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధ్రువీకరించింది. మధుశంక గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్ 17వ సీజన్ ఫస్ట్ హాఫ్‌కు అతడు దూరమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే గెరాల్ కోయెట్జీ సేవలు కోల్పోయింది. గాయపడిన గెరాల్ మొదటి దశకు దూరమయ్యాడు.