Thursday, January 23, 2025

‘ఖిలాడీ’ సంతృప్తినిచ్చింది

- Advertisement -
- Advertisement -

Dimple Hayathi Interview about KHILADI

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇందులో మూడు పాటలను డింపుల్ హయతిపై చిత్రించగా టైటిల్ సాంగ్‌లో మీనాక్షి చౌదరి కనిపించనుంది. ఈ చిత్రం ఈనెల 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ “రవితేజ సినిమా అనగానే మరో మాట మాట్లాడకుండా ఈ సినిమా చేశాను. నా రెండో సినిమాగా ‘ఖిలాడీ’ చేయడం ఆనందంగా ఉంది. రవితేజ సినిమాల్లో కథకు అనుగుణంగా నాయిక పాత్రలుంటాయి. ఈ కమర్షియల్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇక నేను ‘హిట్ 2’ చేశాను. తమిళంలో విజయ్ ఆంథోని మూవీ ‘కొలై’లో నటించాను. మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి”అని అన్నారు. డింపుల్ హయతి మాట్లాడుతూ “లక్కీగా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. ఇందులో నేను భిన్నమైన మూడు సాంగ్‌లు చేశాను. లంగా ఓణితో, ఫుల్ మాస్, గ్లామర్ రోల్ సాంగ్ చేశా. నటిగా ‘ఖిలాడీ’ సినిమా సంతృప్తినిచ్చింది”అని పేర్కొన్నారు.

Dimple Hayathi Interview about KHILADI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News