Friday, November 22, 2024

‘రామబాణం’ అందరినీ అలరించే ఎంటర్‌టైనర్ : డింపుల్ హయతి

- Advertisement -
- Advertisement -

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ డింపుల్ హయతి ‘రామబాణం’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

రామబాణం ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
రామబాణం ‘కిలాడీ’ సినిమా చేస్తున్నపుడే సైన్ చేశాను. కిలాడీలో చాలా గ్లామరస్ గా కనిపించాను. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు శ్రీవాస్ గారు ఎందుకో భైరవిలా అనిపించడం లేదనే సంకోచం వ్యక్తం చేశారు. రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో భైరవి పాత్రకు సరిపోతాననే నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు.

మీ నిజ జీవితానికి, ఈ పాత్రకు డిఫరెన్స్ ఏమిటి ?
ఇందులో అర్బన్ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర పేరు భైరవి. తను వ్లాగర్. నిజ జీవితంలో అయితే నేను సోషల్ మీడియాకి దూరంగా వుంటాను. కాబట్టి ఈ పాత్ర నాకు కొత్తగానే అనిపించింది. రీల్స్, వ్లాగ్స్ చేయడంలో ఫన్ జనరేట్ అయ్యింది. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ లు వున్నారు. వారందరితో కలసి వ్లాగ్ చేయాలి, ఇది చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. రామబాణం అందరినీ అలరించే ఎంటర్ టైనర్.

గోపీచంద్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
గోపీచంద్ గారు చాలా తక్కువగా మాట్లాడతారు. పొద్దున్న హాయ్ అంటే సాయంత్రం బాయ్.. దట్సాల్. నేను కూడా తక్కువగానే మాట్లాడతాను. ఆయన చాలా ఫోకస్డ్ గా వుంటారు. సీన్ సరిగ్గా రాకపోతే ఆయన కళ్ళలోనే అర్ధమైపోతుంది. చాలా కంపోజ్డ్ గా మాట్లాడతారు. గోపీచంద్ గారు జెంటిల్ మెన్. చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

జగపతి బాబు, కుష్బూ లాంటి సీనియర్ నటీనటులు ఇందులో వున్నారు. వారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
‘రామబాణం’సెట్ లో ఎప్పుడూ ఓ పది మంది ఆర్టిస్ట్ లు సెట్ మొత్తం వుంటారు. ఎప్పుడూ కళకళలాడుతూనే వుండేది. సెట్ లోకి వెళ్ళిన తర్వాత జగపతి బాబు గారు , కుష్బూ గారు, అలీ గారు, వెన్నెల కిషోర్, రజిత… ఇలా చెబుతూవుంటే పెద్ద లిస్టే అవుతుంది. ఈ ప్రయాణంలో కుష్బూ గారు నాకు సెకండ్ మదర్ లా అయిపోయారు. చాలా దగ్గరయ్యాం. ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడే కొన్ని ట్రిప్స్ కి కూడా వెళ్లాం. నన్ను వాళ్ళ అమ్మాయిలానే చూసుకున్నారు. సెట్ లో ఆవిడ అనుభవాలని పంచుకున్నారు. అవి నాకు ఎంతగానో సహకరించాయి. అలాగే జగపతి బాబు గారు కూడా. రామబాణం గ్రేట్ జర్నీ.

డ్యాన్సర్ యాక్టర్ అయితే ఎలాంటి అడ్వాంటేజ్ వుంటుంది ? మీ వరకూ డ్యాన్స్ నటనకి ఎలా కలిసొచ్చిందని భావిస్తున్నారు ?
నన్ను చాలా మంది యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళారా ? అని అడుగుతారు. నేను ఎప్పుడూ యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. ఇంట్లోనే చాలా మంది డ్యాన్సర్లు, యాక్టర్స్ వున్నారు. ఇంటి నుంచే ఎక్కువ క్రిటిసిజం వుంటుంది. (నవ్వుతూ). నటన కూడా డ్యాన్స్ నుంచే వచ్చింది.

క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారా?
ప్రత్యేకంగా అరంగేట్రం అంటూ ఏమీ చేయలేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఫ్లో లోనే వచ్చింది. కూచిపూడిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఒకప్పుడు ప్రతిఏడాది వేలాది మంది డ్యాన్సర్లతో సిలికానాంధ్ర ప్రోగ్రాం నిర్వహించేది. అందులో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది.

మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?
మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. చాలా మంది నటులు, డ్యాన్సర్లు వున్నారు. నాన్న బిజినెస్ మాన్. నాన్న తమిళ్. అమ్మ తెలుగు. బెజవాడలో పుట్టాను. హైదరాబాద్ లో పెరిగాను.

గ్లామరస్ పాత్రలో కనిపించారు.. ఇప్పుడు అర్బన్ గర్ల్ పాత్ర చేస్తున్నారు కదా.. ఏలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు.
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. నటిగా గద్దల కొండ గణేష్ సాంగ్ , ఇందులో ఐఫోన్ సాంగ్ ఒకటే. నటిగా సరిగ్గా చేశానో లేదో చూసుకుంటాను. అని రకాల పాత్రలు చేయాలని వుంది.

పరిశ్రమలో తెలుగు అమ్మాయిని ట్రీట్ చేసే విధానం ఎలా వుంది ?
రెండో సినిమాగా రామబాణం చేస్తున్నాను. పరిస్థితులు మారాయి. సినిమా మారింది. శ్రీలీల తెలుగమ్మాయి. మరో నలుగురు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా వచ్చినపుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.

చిన్న సినిమాతో మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోస్ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ పరంగా హ్యాపీ గా వున్నారా ?
నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. ఇంకా ప్రూవ్ చేసుకోవలసినది చాలా వుంది. ఒక పదేళ్ళు గడిచిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలను.

హిందీ, తమిళ సినిమాల ప్రయాణం ఎలా అనిపించింది ?
తమిళ్ లో ప్రభుదేవా, విశాల్ గారితో చేశాను. అలాగే బాలీవుడ్ సినిమా అతరంగిరే లో కూడా చేశాను. నాకు ఇతర భాషల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఈ ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.

శ్రీవాస్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
శ్రీవాస్ గారు స్వీట్ పర్శన్. చాలా అల్లరి చేస్తారు(నవ్వుతూ) ఆయన ప్రతిది చాలా వివరంగా చెప్తారు. నా పాత్రకి సంబధించిన ప్రతి డిటెయిల్ ని ముందే చెప్పి.. వ్లాగర్ గా ఎలా చేయాలనేదానిపై ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు నాకు ఎంతగానో సహకరించాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరిలో పని చేయడం ఎలా అనిపించింది ?
విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు చాలా మంచి మనుషులు. గ్రేట్ ప్రోడ్యుసర్స్. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూరుస్తారు. సినిమా విషయంలో వారికి చాలా క్లారిటీ వుంటుంది. వారి నిర్మాణంలో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరోసారి వారి నిర్మాణంలో పని చేయాలని వుంది.

కొత్త చేయబోతున్న ప్రాజెక్ట్స్ ?
తెలుగు, తమిళ్ లో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News